బిగ్ బాస్ 10: ఈ వారం నామినేషన్స్ లిస్ట్
Bigg Boss 10: This week's nominations list
బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ నుంచి ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఇక మూడో వారంలో బిగ్ బాస్ హౌస్ మొత్తం హాట్ హాట్ రచ్చ మొదలయ్యింది. వర్షిణి, ముఖేష్ గౌడ్ ఇంకా సుదీర్ లు త్రిగుణ్ పై ఫైర్ అవుతున్నారు. అతను మ్యానిప్యులేటర్ అంటూ నాగ్ ముందే కుండ బద్దలు కొట్టారు. ఇక సుధీర్ కి సృష్టి కి మధ్యన ఫ్రెండ్ షిప్ గొడవ ఈ నామినేషన్స్ లో హైలెట్ అయ్యింది.
సుధీర్, సృష్టిలు ఈ నామినేషన్స్ లో రెచ్చిపోయి గొడవపడ్డారు. అలాగే దేబ్జానీ మాస్క్ వేసుకుంది అంటూ త్రిగుణ్ గొడవ పడ్డాడు. మధ్యలో షాలిని కి దేబ్జానీ కి నామినేషన్స్ రచ్చ, చరణ్ కెప్టెన్ ఝాన్సీ ని టార్గెట్ చేసాడు. ఈ మూడో వారం నామినేషన్స్ రచ్చ హౌస్ లో టాప్ ఎగిరిపోతుందా అనిపించింది.
బిగ్ బాస్ 10 మూడో వారంలో వంశీ, సుధీర్, రోహిత్, షాలినీ, శ్రిష్టి, వర్షిణి, ముఖేష్, త్రిగుణ్ నామినేట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ లిస్ట్ లో ఉన్న వారిలో రోహిత్, త్రిగుణ్, ముఖేష్ టాప్ ప్లేస్‌లోనే ఓట్లు రాబడతారు. మిగిలిన వారంతా తమ తమ పెరఫార్మెన్స్ ను బట్టి సేవ్ అవుతారు.
















































