ఊహాగానాలకు హీరోయిన్ చెక్
Kayadu To Promote The Paradise
ఫైనల్లీ ప్యారడైజ్ హీరోయిన్ కాయదు లోహర్ ది ప్యారడైజ్ ప్రమోషన్స్ లో మెరిసింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాకు కాయదు లోహర్ చెక్ పెట్టింది. గత నాలుగు రోజులుగా హీరో నాని ఒంటి చేత్తో ప్యారడైజ్ ని ప్రమోట్ చేస్తున్నారు. కాయదు లోహర్ కి ఆమె కొత్త దర్శకుడు మారి సెల్వరాజ్ పర్మిషన్ ఇవ్వలేదు అని నాని చాలా క్యాజువల్ గా చెప్పారు.
కానీ అందరిలో ఎన్నో అనుమానాలు, కాయదు లోహర్ కి దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు గొడవ అని, కాదు కాదు ప్యారడైజ్ టీం తో ఆమెకు పడడం లేదు అని, నిజంగా నాని చెప్పినట్టుగా ఇవన్నీ జస్ట్ అనుమానాలే. ఈ ఊహాగానాలకు కాయదు చెక్ పెడుతూ ఈరోజు హైదరాబాద్ లో పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వూస్ ఇచ్చింది.
అంటే ఈరోజు జరగబోయే ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను కాయదు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతుంది. సో నాని పక్కన కాయదు.. ఇలా ఊహాగానాలు చెక్ అన్నమాట.
















































