BB10: పళ్ళు రాలతాయ్ అంటూ సృష్టి రచ్చ
Bigg Boss 10: 3rd week nominations fight
బిగ్ బాస్ సీజన్ 10 మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. మొదటి వారం బిగ్ బాస్ నుంచి చైత్ర రాయ్ ఎలిమినేట్ అవ్వగా, రెండో వారం కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఇక మూడో వారం లో నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే రెండో వారంలో నువ్వు హౌస్ లో కనిపించలేదు అంటూ హోస్ట్ నాగార్జున సృష్టి ఇంకా కృష్ణుడిని దూరంగా కూర్చోబెట్టారు.
అందుకేనేమో ఈ వారం నామినేషన్స్ లో సృష్టి మాములుగా రెచ్చిపోలేదు. నువ్వు నన్ను ఫ్రెండ్ గా భావిస్తున్నావా అని సృష్టి సుధీర్ ని అడిగితే దానికి వర్షిణిని పిలిచాడు సుధీర్, దానితో సృష్టి కి కోపమొచ్చింది. సుధీర్ ని నామినేట్ చేస్తూ రోహిత్ సుధీర్ అంటే సృష్టి కదా అనగానే నువ్వు అబద్దాలు ఆడుతున్నావ్ అన్నాడు రోహిత్. అది నా స్ట్రాటజీ అన్నాడు సుధీర్. ఇక నామినెట్ అయ్యాక సుధీర్, సృష్టి నాకు ఫ్రెండ్ మాత్రమే, నాకు ఫ్రీడమ్ వచ్చింది బిగ్ బాస్ అన్నాడు సుధీర్.
నాకు ఫ్రీడమ్ వచ్చింది అన్న సుధీర్ పై సృష్టి రెచ్చిపోయి నువ్వు నా టైప్ కాదు అని చెప్పాను, పిచ్చి వేషాలు వేసి, ఓ గుద్దు గుద్దితే పళ్ళు రాలిపోతాయ్ అంటూ సుధీర్ పై రెచ్చిపోయి ఏడ్చుకుంటూ హౌస్ లోపలికి వెళ్లిన సృష్టిని ఓదార్చేందుకు కామనర్స్ పరుగులు పెట్టారు.
ఆతర్వాత కూడా డే 1 నుంచి చెబుతున్నా నువ్వు నా టైప్ కాదని అంటూ షాలిని వద్ద సృష్టి బాధపడుతున్న ప్రోమోని స్టార్ మా వదిలింది.
















































