నైజాం లో ప్యారడైజ్ ర్యాంపేజ్
The Paradise Rampage in Nizam
ట్రైలర్ లేకపోతేనేమి ప్యారడైజ్ క్రేజ్ ఎలా ఉందొ అనేది డిస్ట్రిక్ట్ యాప్ చూస్తే తెలుస్తుంది. నాని ప్రమోషన్స్ లో కష్టపడుతున్నాడు. నిన్న నైట్ నైజాం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నైజాం బుకింగ్స్ ఓపెన్ అయిన మరు క్షణమే టికెట్ బుకింగ్స్ లో ప్యారడైజ్ ర్యాంపేజ్ ఆడిస్తుంది.
నాని ప్యారడైజ్ పై ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందొ, ఎంత క్రేజ్ ఉందొ అనేది దీనిని బట్టే అర్ధమవుతుంది. సెప్టెంబర్ 24 న విడుదల కాబోతున్న ప్యారడైజ్ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే లిమిటెడ్ ప్రమోషన్స్, ట్రైలర్ లేకపోవడంతో ప్యారడైజ్ ఓపెనింగ్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నారు.
కానీ టికెట్ బుకింగ్స్ లో ప్యారడైజ్ జోరు చూస్తుంటే నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ప్యారడైజ్ పేరిట నమోదు అయ్యేలా కనిపిస్తుంది. టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయిన గంట లోపే వేలల్లో టికెట్స్ తెగుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన రేట్లతో నైజాం లో బుకింగ్స్ ఓపెన్ కాగా... త్వరలోనే మిగతా ఏరియా ల్లోనూ బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి.
















































