Tollywood: బోరింగ్ వీకెండ్

 Tollywood: Boring weekendTollywood: Boring weekend

 

ఈ వారం విడుదల కావాల్సిన డబ్బింగ్ మూవీ హనుమాన్ అంశ్ మరియు మైత్రి మూవీ మేకర్స్ విడుదల చెయ్యాల్సిన 418 చిత్రాలు విడుదల వాయిదా పడ్డాయి. అయినప్పటికి పొలోమంటూ పలు చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర జాతరను తలపించాయి. ఈవారం అన్ని చిన్న సినిమాలే విడుదలయ్యాయి.

అందులో ఒక చిత్రం కూడా ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యే సినిమా లేదు. హ్యాపీ జర్నీ, సీక్రెట్ సోల్జర్, మిస్సింగ్ మేఘన, కాగితం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్ఛాయి. చిన్న సినిమాలైనా కంటెంట్ బలంగా ఉంటె ఆడియన్స్ ఆదరిస్తారని చాలా సినిమాలు నిరూపించాయి.

కానీ ఈ శుక్రవారం విడుదలైన ఏ చిత్రము ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. ఏ చిత్రానికి కనీసం ఓపెనింగ్స్ లేవు. మినిమం ప్రేక్షకులు థియేటర్స్ లో కనిపించలేదు. మరి ఈ బోరింగ్ వీకెండ్ ని ప్రేక్షకులు మరిచిపోయి రేపు 24 న రాబోయే ప్యారడైస్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే. నాని ప్యారడైస్ సెప్టెంబర్ 24 న విడుదల కాబోతుంది.   

Tollywood