ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mixed response to Irumudi from OTT platform

ఓటీటీ నుంచి ఇరుముడికి మిక్స్డ్ రెస్పాన్స్

Mixed response to Irumudi from OTT platformMixed response to Irumudi from OTT platform


థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రవితేజ ఇరుముడి ఇప్పుడు బుల్లితెర అదేనండి ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ నుంచి ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఇరుముడిని చూసి చాలామంది కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. థియేటర్స్ ని ఊపేసిన ఈ చిత్రానికి ఓటీటీలో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించడం అందరికి షాకిచ్చింది.

థియేటర్స్ లో ఏది చూసి పూనకాలతో ప్రేక్షకులు ఊగిపోయారో.. అది టీవీ స్క్రీన్ పై చూసేసరికి అంత ఊపు రాలేదు అంటున్నారు. మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు హారతులిచ్చిన ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ లో చూసి ఓకే ఓకే అంటున్నారు. ఇక చివరిలో ఎమోషనల్ సీన్స్ థియేటర్స్ లో ప్రేక్షకులకు కంటతడి పెట్టించాయి.

కానీ అది టివి స్క్రీన్ పై చూసేసరికి అంత బలమైన ఎమోషన్స్ గా కనిపించలేదు అంటున్నారు. ఏది ఏమైనా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రవితేజ ఇరుముడి ఓటీటీ లో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

Irumudi OTT talk