నాని బ్లడీ రోమియో లో పృథ్వీరాజ్
Bloody Romeo: Interesting deets of Malayalam actor role
హీరో నాని ప్యారడైజ్ ను పాన్ ఇండియా థియేటర్స్ లోకి తెచ్చేందుకు తెగ కష్టపడుతున్నాడు. సోలో గా నాని ప్యారడైజ్ ని ప్రమోట్ చేస్తున్నాడు. చెన్నై, బెంగుళూరు, కొచ్చి ప్రెస్ మీట్స్ లో నాని చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతూ ఆయా భాషల ఆడియన్స్ ను బుట్టలో వేస్తున్నాడు.
అందులో భాగంగా తన తదుపరి చిత్రం బ్లడీ రోమియో చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ క్రేజీ రోల్ చేస్తున్నారంటూ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ని రివీల్ చేసారు. అయితే అది ప్రతి నాయకుడు పాత్ర కాదు అంటూ నాని క్లూ కూడా ఇచ్చేసారు. సుజిత్ దర్శకత్వంలో నాని చెయ్యబోయే బ్లడీ రోమియో లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారు.
ఇక ప్యారడైజ్ రిలీజ్ కాగానే నాని కొద్దిగా బ్రేక్ తీసుకుని ఇమ్మిడియట్ గా సుజిత్ దర్శకత్వంలో మొదలు కాబోయే బ్లడీ రోమియో సెట్ లోకి వెళ్ళిపోతారు. మరి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ బ్లడీ రోమియో లో ఎలాంటి కేరెక్టర్ చేస్తున్నారో అనే విషయంలో విపరీతమైన క్యూరియాసిటీ మొదలయ్యింది.
















































