ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiranjeevi clears Kaaka vs Vishwambhara Sankranti clash

విశ్వంభర : కామెడీ అయిపొయింది గురూ

Chiranjeevi clears Kaaka vs Vishwambhara Sankranti clashChiranjeevi clears Kaaka vs Vishwambhara Sankranti clash


మెగాస్టార్ చిరంజీవి లాంటి వారి సినిమాకే విడుదల తేదీ విషయంలో ఇంత గందరగోళం నడుస్తుంటే.. చిన్న హీరోల పరిస్థితి ఏమిటి. చిరు విశ్వంభర విడుదల తేదీ కోసం గత ఏడాదిన్నరగా మెగా ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అనేది చూస్తున్నాం. సీజీ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఇక విడుదల తేదీ ప్రకటించడమే తరువాయి అన్నారు.

దానితో డిసెంబర్ అయినా, లేదంటే సంక్రాంతి 2027 అయినా విశ్వంభర విడుదల ఉండొచ్చనే ప్రచారం జరిగింది. చిరు మరో మూవీ కాకా కూడా సంక్రాంతికే వస్తుంది. కాకా ను వెనక్కి తగ్గమంటే కుదరదు అంటున్నారు. విశ్వంభర, కాకా నిర్మాతలతో చిరు మీటింగ్ జరిగింది. కాకా తప్పుకోవడం లేదు, దానితో విశ్వంభర విడుదల అయోమయంలో పడింది.

ఇప్పటికే విశ్వంభర పై వస్తున్న మీమ్స్, ట్రోల్స్ మెగా ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి. విశ్వంభర విడుదల తేదీ అనేది మరీ కామెడీగా తయారయ్యింది. ఇక సంక్రాంతి కాకపోతే ఫిబ్రవరి లేదంటే సమ్మర్ కి విశ్వంభర వెళ్లొచ్చనే ఉహాగానాలు మొదలయ్యాయి. మరి దర్శకుడు వశిష్ట విశ్వంభర విషయం పక్కనపెట్టి నందమూరి కాంపౌండ్ కి చేరాడు. అందుకే మెగా ఫ్యాన్స్ లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. 

Vishwambhara is reportedly eyeing a summer release