బాద్‌షా మనసు గెలుచుకున్న సూపర్ స్టార్
SRK says more than one word about Mahesh Babu
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్- సూపర్ స్టార్ మహేష్ లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమం ఎక్స్ లో షారుఖ్ ఖాన్ నిర్వహించిన #AskSRK సెషన్‌లో మహేష్ బాబు ప్రస్తావన వచ్చింది. ఓ అభిమాని మహేష్ గురించి ఒక్క మాటలో చెప్పమని షారుఖ్‌ను కోరగా ఆయన స్పందిస్తూ సూపర్ స్టార్‌పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ ప్రశ్నపై స్పందించిన షారుఖ్ ఖాన్, మహేష్ ను ఒక్క మాటకే పరిమితం చేయకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. `మేము ఎప్పుడు కలిసినా ఆయన ఎంతో మర్యాదగా, మైత్రితో స్పందిస్తారు. ఆయన ఎంతో స్వీట్ అండ్ కైండ్. దేవుడు ఆయన్ని చల్లగా చూడాలి` అని షారుఖ్ ఆత్మీయంగా బదులిచ్చారు. ఇద్దరి మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం ..అనుబంధం అభిమానులను ఎంతో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఇద్దరు రాబోయే భారీ చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' చిత్రంలో నటిస్తుండగా, మహేష్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `వారణాసి` చిత్రంలో రుద్ర పాత్రలో అలరించబోతున్నారు.
















































