క్రిస్మస్ బరిలో బాలీవుడ్ vs టాలీవుడ్
Bollywood vs Tollywood in Christmas race
ఈ క్రిస్మస్ సీజన్ బాక్సాఫీస్ వద్ద అత్యంత రసవత్తరంగా మారనుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ చిత్రం `కింగ్` సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఆయన ఆస్క్SRK సెషన్‌లో ధృవీకరించారు. అయితే హాలీవుడ్ నుంచి `అవెంజర్స్: డూమ్స్‌డే`, `డ్యూన్: పార్ట్ 3` వంటి దిగ్గజ చిత్రాలు బరిలో దిగుతుండగా.. మన దేశంలో మాత్రం టాలీవుడ్ నుంచి ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు క్రిస్మస్ బరిలో దిగేందుకు సిద్ధమవుతుండటం విశేషం.
ఈ భారీ పోటీలో టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలవనున్న 100వ సినిమాతో పాటు.. మరో మూడు పెద్ద సినిమాలు రిలీజయ్యేందుకు ఛాన్సుందని గుసగుస వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `విశ్వంభర` కూడా ఇదే సీజన్ లో వస్తోందా? అనేదానికి త్వరలోనే సమాధానం రానుంది. వీటితో పాటు విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన.. మరో క్రేజీ ప్రాజెక్ట్ `దాదా` సినిమాలు కూడా డిసెంబర్ రేసులో నిలిచాయి. ఒకే సీజన్‌లో ఏకంగా ఇద్దరు `కింగ్`లు (షారుఖ్ ఖాన్, నాగార్జున) తో పాటు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు కూడా విడుదలవుతుండటంతో ఈ బాక్సాఫీస్ క్లాష్ ఎవరికి లాభిస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇలా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలన్నీ ఒకేసారి క్రిస్మస్ పండుగను టార్గెట్ చేయడంతో థియేటర్ల యుద్ధం తారాస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. విభిన్న జానర్లలో రానున్న ఈ చిత్రాలు ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబడతాయి..? ఏ హీరో బాక్సాఫీస్ కింగ్‌గా నిలుస్తారనేది వేచి చూడాలి. క్రిస్మస్ బరిలో దిగుతున్న ఈ భారీ చిత్రాల పరుగులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందోనని సినీ వర్గాలు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
















































