కత్రినా కైఫ్ లుక్ చూసి షాకవుతున్నారు
Katrina Kaif joined the Ambani family's Ganesh Chaturthi celebrations
ఎప్పుడు నాజూగ్గా స్లిమ్ గా కనిపించే మల్లీశ్వరి కత్రినా కైఫ్ ని పబ్లిక్ లో చూసి చాలా రోజులైంది గతంలో కత్రినా కైఫ్ ఏ సినిమాలో నటించినా లేదంటే సోషల్ మీడియా పిక్స్ చూసినా అభిమానులు అల్లాడిపోయేవారు. అంత నాజూగ్గా అందరిని మెస్మరైజ్ చేసేది. అయితే హీరోయిన్ గా టాప్ పొజిషన్ ని అందుకోలేకపోయిన కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమ వివాహం చేసుకుంది.
విక్కీ కౌశల్-కత్రినాకు ఓ బిడ్డ కూడా జన్మించారు. అయితే ఈమధ్యన కత్రినా కైఫ్ రీ ఎంట్రీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలోనే కత్రినా కైఫ్ ముంబై లోని ముఖేష్ అంబానీ ఇంట జరిగిన వినాయక చవితి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంది.
బాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొన్న ఈవేడుకలకు కత్రినా భర్త విక్కీ కౌశల్ తో కలిసి హాజరవగా కత్రినా బాగా బరువు పెరిగి బొద్దుగా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. కత్రినా కైఫ్ న్యూ లుక్ చూసి అందరూ షాకవుతున్నారు. మల్లీశ్వరి ఏమిటి అంత బరువుగా కనిపించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
















































