మెల్లగా ఎక్కేసిన మందాడి

Mandaadi public talkMandaadi public talk

 

గత గురువారం విడుదలైన సర్దార్ 2 కి డిజాస్టర్ రివ్యూస్ రాగా.. సుహాస్, సూరి కలయికలో తెరకెక్కిన మందాడి చిత్రానికి యావరేజ్ రివ్యూస్ వచ్ఛాయి. మొదటిరోజు మందాడి చిత్రాన్ని సో సో అన్న ప్రేక్షకులు, రెండో రోజు విడుదలై ఎపిక్, మహేంద్రగిరి వారాహి చూసాక మందాడి బావుంది అన్నారు.

మరోపక్క తమిళనాట కూడా సర్దార్ 2 తేలిపోవడంతో మందాడి చిత్రానికి కలిసొచ్చింది. అందుకే ఈ లాంగ్ వీకెండ్ ని తెలివిగా మౌత్ టాక్ తో క్యాష్ చేసుకుంది. ఇంకా ప్రోపర్ ప్రమోషన్స్ ఉన్నట్టయితే మందాడి కి ఇంకాస్త బెటర్ కలెక్షన్స్ వచ్చేవి, అయినా ఇప్పుడు మెల్లగా థియేటర్స్ లో ప్రేక్షకులకు ఎక్కేసింది.

మందాడి థియేటర్స్ లో ఈ వీకెండ్ లో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. సుహాస్, సూరి లు సక్సెస్ మీట్స్ తో సినిమాని మరికాస్త ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి ఈ వీకెండ్ విన్నర్ మందాడినే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి కేవలం మౌత్ టాక్ తో కోట్లు కొల్లగొడుతుంది.

Mandaadi Social media Talk