కావ్య కళ్యాణ్ పెళ్లి డేట్ ఫిక్స్
Kavya-Kaala Bhairavaya to wed on this date
హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, ఆస్కార్ అవార్డు గ్రహీత , మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ ల వివాహం అఫీషియల్ అయ్యింది. కొద్దిరోజులుగా సీక్రెట్ డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. కావ్య కళ్యాణ్ రామ్ తో తను ప్రేమలో ఉన్నట్లుగా కాల భైరవ కన్ ఫర్మ్ చేసారు.
కాల భైరవ, కావ్య కళ్యాణ్ రామ్ లు తమ ప్రేమ విషయాన్ని రివీల్ చేసినప్పుడే ఇరు కుటుంబాల వారు లగ్నపత్రి వేడుకను కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. తాజాగా వీరి వివాహానికి సుముహూర్తం నిశ్చయించినట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఈ ఏడాది డిసెంబర్ లో కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ వివాహానికి కీరవాణి, కావ్య ఫ్యామిలీ నిశ్చయించారని.. కానీ అది ఏ తేదీ అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఈ వేడుకలు హైదరాబాద్ లో జరుగుతాయా, లేదంటే డెస్టినేషన్ వెడ్డింగ్ గా కావ్య-కాల భైరవ వివాహం జరగనుందో అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
















































