ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Eesha Rebba And Tharun Bhascker Celebrate Vinayaka Chavithi

జంటగా దర్శనమిచ్చిన ఈషా రెబ్బ-తరుణ్ భాస్కర్

Eesha Rebba And Tharun Bhascker Celebrate Vinayaka Chavithi Eesha Rebba And Tharun Bhascker Celebrate Vinayaka Chavithi


హీరోయిన్ ఈషా రెబ్బ-దర్శకుడు తరుణ్ భాస్కర్ సీక్రెట్ డేటింగ్ చేస్తున్నారు అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. తరుణ్ భాస్కర్ ఒకసారి వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత కొద్దిగా గ్యాప్ తర్వాత ఈషా రెబ్బ తో తరుణ్ భాస్కర్ ప్రేమలో పడి , డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ ఉన్నాయి.

ఆ విషయాన్నీ ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ ఓపెన్ గా మాట్లాడకపోయినా.. ఎక్కువగా కలిసి కనిపించడంతో ఈ రూమర్లు కి బలం చేకూరింది. తాజాగా వినాయక చవితి ఫెస్టివల్ లో ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ లు కలిసి పూజ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ లు కలిసి పూజలో పాల్గొన్నారు అంటే మరి పెళ్ళికి రెడీ అయినట్లేనా, ఆ గుడ్ న్యూస్ కూడా త్వరలోనే వినబోతున్నామా అనే విషయంలో నెటిజెన్స్ క్యూరియాసిటీతో కనిపిస్తున్నారు.

Tharun Bhascker and actress Eesha Rebba celebrate Vinayaka Chavithi together, fueling dating rumors