గోపికమ్మ గా శ్రీలీల

Sreeleela Looks Like a GopikaSreeleela Looks Like a Gopika

 

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియా లుక్స్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పడం కష్టమే. అమ్మడు కెరీర్ లో హిట్స్ తక్కువ ప్లాప్స్ ఎక్కువ, అయినా శ్రీలీల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్ లో బ్రహ్మాండమైన ఆఫర్స్ పట్టెయ్యడమేకాదు అమ్మడు సౌత్ నుంచి ముంబై కి షిఫ్ట్ అవుతుంది అనే టాక్ మొదలైపోయింది.

తమిళనాట ధనుష్ తో ఓం చిత్రంలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల కి తెలుగులో మాత్రం ప్రాజెక్ట్స్ లేవు. రీసెంట్ గా నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో మోక్షు సరసన శ్రీలీల పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ లో వన్ బై వన్ ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంటూ అక్కడ కూడా బిజీగా మారబోతుంది.

తాజాగా శ్రీలీల గోపిక లుక్ లో ఆడియన్స్ మనసులు దోచేసింది. రాధమ్మ మాదిరి కాస్త్యుమ్స్ వేసుకుని, ట్రెడిషనల్ గా మోడ్రెన్ లంగాఓణిలో శ్రీలీలేగోపికమ్మగా నిజంగా అదరగొట్టేసింది. మీరు కూడా క్యూట్ అండ్ స్వీట్ గోపికపై ఓ లుక్కెయ్యండి. 

Sreeleela Looks Like a Gopika in Her Stunning Radha Avatar