ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mokshagna Grand Debut Nandamuri Balakrishna To Play A Crucial Role

మోక్షజ్ఞ డెబ్యూలో స్పెషల్ సర్ ప్రైజ్

Mokshagna Grand Debut Nandamuri Balakrishna To Play A Crucial RoleMokshagna Grand Debut Nandamuri Balakrishna To Play A Crucial Role

ఎట్టకేలకు నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీరంగ ఎంట్రీ కి రంగం సిద్ధం అయ్యింది. దర్శకుడు వశిష్ట మోక్షజ్ఞ బాద్యతను కంప్లీట్ గా ఎత్తుకున్నారు. బాలకృష్ణ కొడుకు గురించి అలోచించి మరీ ఏరి కోరి వశిష్ట ను తీసుకొచ్చారు. అన్ స్థాపబుల్ లో వర్క్ నచ్చి ప్రశాంత్ వర్మను చూసి బాలయ్య ముచ్చటపడి కొడుకు మోక్షు కోసం తీసుకొస్తే ఆ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ తోనే ఆగిపోయింది.

ఇప్పుడు మాత్రం బాలయ్య చాలా సీరియస్ గా ఏరికోరి వసిష్ఠను పట్టుకోవడమే కాదు.. కొడుకు మొదటి సినిమాలో ఆయన కూడా భాగమవుతున్నారట. అంటే కొడుకు కోసం కథ ప్రిపేర్ చేసి దర్శకత్వం కూడా చెయ్యాలనుకున్న బాలయ్య ఈసారి టెక్నీకల్ గా కాకుండా.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కనిపిస్తారట.

అది కూడా దాదాపుగా 40 నిమిషాల పాటు మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కనిపిస్తారని టాక్. సినిమాలో అతి కీలకమైన పాత్రను బాలయ్య పోషించబోతున్నారట. సో ఇది మోక్షజ్ఞ డెబ్యూ అనేకన్నా.. తండ్రీ-కొడుకుల సినిమా అంటే బావుంటుందేమో. మరి ఈ న్యూస్ నందమూరి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ అనే చెప్పాలి. 

Nandamuri Mokshagna