ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> BB 10: Nagarjuna punishes Thrigun and Rohit

BB 10: కంటెస్టెంట్స్ ని పనిష్ చేసిన నాగ్

BB 10: Nagarjuna punishes Thrigun and Rohit BB 10: Nagarjuna punishes Thrigun and Rohit


గత సీజన్స్ ఎలా ఉన్నా బిగ్ బాస్ సీజన్ 10 ని చాలా డిఫ్రెంట్ గా ప్లాన్ చేసారు. హౌస్ లోకి 16 మందిని పంపి మొదటి వారం తిరిగే లోపే ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేశారు. మూడో ఎలిమినేషన్ కు రెడీ అయ్యారు. అంతేకాదు శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తప్పులు ఎత్తి చూపి వారికి వార్నింగ్ ఇచ్చే నాగ్ ఈసారి వెంటనే పనిష్మెంట్ కూడా ఇచ్చేసారు.

హౌస్ లో తప్పు చేసినవారికి వీడియోస్ వేసి చూపించి మరీ వార్నింగ్ ఇచ్చిన నాగ్ ఆన్ దిస్ స్పాట్ పనిష్మెంట్ ఇచ్చారు. కామన్ మ్యాన్ రోహిత్ కి ఎంగిలి కప్పులు కడగడం ఏమిటో నాగ్ స్వయంగా చూపించి మరీ అతనికి పనిష్మెంట్ ఇచ్చారు. ఇక త్రిగున్ వాడిన కొన్ని పదాలు హర్టింగ్ గా ఉన్నాయంటూ అతనికి లాన్ లో టైర్ మోసే పనిష్మెంట్ ఇచ్చారు.

రామ్ ప్రసాద్ కామెడీ హద్దులు మీరొద్దని చెప్పిన నాగార్జున షాలిని బిహేవియర్ ని క్వచ్చన్ చేసారు. సో ఏ వారం తప్పు ఆ వారమే క్లియర్ అన్నట్టుగా నాగార్జున హౌస్ మేట్స్ ని పనిష్ చేసిన తీరుకి బుల్లితెర ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా ఫీలవుతున్నారు.

Bigg Boss Telugu 10: Nagarjuna punishes Thrigun and Rohit