ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Do Movie Trailers Actually Sell Tickets

ట్రైలర్ చూపించి టికెట్లు అమ్మాలి

Do Movie Trailers Actually Sell TicketsDo Movie Trailers Actually Sell Tickets


ఈమధ్య కాలంలో ట్రైలర్ ని చూసి సినిమాకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ట్రైలర్ కట్ ఆసక్తికరంగా ఉంటేనే టికెట్స్ తెగుతున్నాయి, మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఒక సినిమాకి ప్రమోషన్స్ ఎంత కీలకమో అంతకుమించి ట్రైలర్ కట్ కీలకం అవుతుంది. అందుకే ఆచి తూచి ట్రైలర్ కట్ కోసం కష్టపడతారు.

ఇప్పడు సమయం ఎక్కువ లేదు అందువల్ల ట్రైలర్ విడుదల చేయలేము, ఒకవేళ ట్రైలర్ కట్ కావాలంటే మూడు, నాలుగు రోజులు దానిపైనే టీం అంతా వర్క్ చేస్తూ కూర్చోవాలి, అందుకే ప్యారడైజ్ కి ట్రైలర్ ఇవ్వలేకపోతున్నామంటూ హీరో నాని ప్యారడైజ్ ప్రెస్ మీట్ లో చెప్పడం ఆయన అభిమానులకు షాక్ ఇచ్చింది.

ది ప్యారడైజ్ విడుదలకు ఇంకా 10 రోజుల సమయమే ఉంది. అందుకే ప్యారడైజ్ టీమ్ ట్రైలర్ ని స్కిప్ చేస్తున్నారు. ఇంతకుముందు 
ప్యారడైజ్ నుంచి వచ్చిన టీజర్ విషయంలో విమర్శలొచ్చాయి. నాని డైలాగ్ డెలివరీపై చాల రకాల చర్చలు జరిగాయి. మరి ఈ కాస్త నెగివిటిని పోగొట్టుకోవాలంటే అదిరిపోయే ట్రైలర్ వదలాలి.

కానీ ఇప్పుడు ట్రైలర్ లేదు అంటున్నారు. ట్రైలర్ చూసి టికెట్స్ తెగుతున్న ఈరోజుల్లో ట్రైలర్ లేకుండా ప్యారడైజ్ మొదటిరోజు ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. 

No Trailer For The Paradise