కొడుకుని ఇంట్రడ్యూస్ చేసిన మెగా హీరో
Meet Vaayuv Konidela On His First Birthday
మెగా హీరో వరుణ్ తేజ్ కి గత ఏడాది కొడుకు పుట్టాడు నాగబాబు ఇంట వారసుడు అడుగుపెట్టాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని వరుణ్ తేజ్ ప్రేమించి పెద్దల అంగీకారంతో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి అత్తమామలతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటుంది.
నటనని కంటిన్యూ చేస్తున్న లావణ్య కు గత ఏడాది కొడుకు జన్మించాడు. బాబు పేరు వాయువ్ తేజ్ గా నామకరణం చేసారు. అప్పటినుంచి మెగా వారసుడు ని అభిమానులకు పరిచయం చెయ్యని వరుణ్ తేజ్ దంపతులు తమ కొడుకు వాయువ్ తేజ్ బర్త్ డే రోజున అందరికి పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసారు.
My dear boy, you changed my world in the best way possible. I fell in love with you even before I laid my eyes on you for the first time. Being your father is the most beautiful part of my life.
Happy 1st birthday, Vaayuv.
I love you, always.❤️😘 అంటూ కొడుకు వాయువ్ తేజ్ కి బర్త్ డే విషెస్ తెలిపాడు.







































