ఫౌజీ మేకర్స్ మౌనం వెనుక కారణం

Is this the reason behind Fauzi delayIs this the reason behind Fauzi delay


గత రెండు రోజులుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ రిలీజ్ వాయిదా వార్తలను మేకర్స్ ఖండించడం లేదు. సరే ఒకవేళ ఫౌజీ రిలీజ్ డిసెంబర్ 3 నుంచి వాయిదా పడితే గనక ఆ విషయం ఏదో అఫీషియల్ గా చెబితే ఫ్యాన్స్ లో ఆందోళన తగ్గుతుంది. ఫౌజీ మేకర్స్ మౌనం వెనుక కారణం ఏమిటో తెలియక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

ఫౌజీ డిసెంబర్ 3 న పోస్ట్ పోన్ అయితే మళ్లీ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది, 2027 అంటూ ఊహాగానాలు సోషల్ మీడియా ని చుట్టేస్తున్నాయి. అంటే ఏ సంక్రాంతి కో, లేదంటే ఫిబ్రవరి కో ఫౌజీ విడుదల ఉంటుందా ఈ కన్ఫ్యూజన్ లోనే అభిమానులు కొట్టుమిట్టాడుతున్నారు. అదేదో మేకర్స్ అధికారికంగా పోస్ట్ పోన్ వార్తలను కన్ ఫర్మ్ చేస్తే బావుండేది.

అటు ప్రభాస్ ని కూడా సినిమాలు లైన్ లో పెట్టడం కాదు, అనుకున్న సమయానికి సినిమాలు విడుదల కావాలి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యడం అభిమానులకు కోపం తెప్పిస్తుంది. ఇదంతా గమనిస్తున్న ఫౌజీ మేకర్స్ ఎప్పుడు లైన్ లోకి వస్తారో చూడాలి. 

Fauzi delay due to this reason