హీరోయిన్స్ అందరికి షాకే

Toxic: A shock for all the heroinesToxic: A shock for all the heroines


టాక్సిక్ చిత్రంలో పొలోమంటూ ఐదుగురు క్రేజీ హీరోయిన్స్ నటించారు. కేజిఎఫ్ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ టాక్సిక్ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ భారీగా తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం క్రేజీ హీరోయిన్స్ ని తీసుకొచ్చారు. భారీ పారితోషికం ఇచ్చి నయనతార, బాలీవుడ్ హాట్ భామ కియారా అద్వానీ, పాన్ ఇండియా గర్ల్ రుక్మిణి వసంత్, బాలీవుడ్ తారలు హ్యూమ ఖురేషి, తార సుతారియా లను తీసుకోచ్చారు.

ఇప్పుడు చూస్తే టాక్సిక్ చిత్రానికి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. యశ్ నటనకు, నయనతార నటనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా మిగతా సినిమా విషయంలో బోలెడన్ని విమర్శలు రావడం చూసి ఐదుగురు హీరోయిన్లకు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ హోల్సేల్ షాకిచ్చారు. టాక్సిక్ సినిమా హిట్ అయితే వారి పాత్రలకు ప్రాధాన్యత లేకపోయినా పట్టించుకునేవారు కారు.

నయనతార తనకు టాక్సిక్ లో చాలామంది హీరోయిన్స్ మద్యన చెయ్యడం ఇష్టం లేకపోయినా.. గీతు మోహన్ దాస్ చెప్పిన స్టోరీ నచ్చి చేశాను అంది, అలాగే యశ్ అడిగారని ప్రమోషన్ కి వచ్చాను అంది, మరి ఇదంతా వేస్ట్. ఇక కియారా కు సౌత్ మళ్లీ షాక్ ఇచ్చింది. పాన్ ఇండియా లో క్రేజీగా మారిన రుక్మిణి పేరు టాక్సిక్ విడుదల తర్వాత అస్సలు వినిపించడమే లేదు.

అందుకే అనేది టాక్సిక్ లో మితిమీరిన అందాలు ఆరబోసిన హీరియిన్స్ అందరికి షాకే అని. 

Toxic Talk