ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anupama Parameswaran reveals how her BF insulted her

మూడ్ స్వింగ్స్ అంటూ అవమానించాడు - అనుపమ

Anupama Parameswaran reveals how her BF insulted her


రీసెంట్ గా నటి అనుపమ పరమేశ్వరన్ ఓ ఇంటర్వ్యూలో తన మాజీ లవర్, లవ్ బ్రేకప్ పై సంచలన ఆరోపణలు చేసారు. తనకు ప్రేమ బంధంలో మోసపోయాను అని, ఆ బంధంలో నిజాయితీ లేదు, చిత్రవధ అనుభవించాను, ప్రేమలో మొదట్లో బాగానే ఉన్నా అతనిలోని అపరిచితుడు బయటపడతాడు, ఆ బంధంలో నరకం అనుభవించాను, దాని కారణంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అంటూ సంచలనంగా మాట్లాడిన విషయం తెలిసిందే.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన మాజీ లవర్ పై మరిన్ని ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నేను ఓ నటి అయినందుకు, ధైర్యంగా ఉన్నందుకు, ప్రతి నెలా పీరియడ్స్ వచ్చే ఒక అమ్మాయి అయినందుకు నిజంగా నేను సిగ్గుపడే స్థితిలోకి నన్ను అతను నెట్టేశాడు. ప్రతి నెలలో ఏ రోజు వెళ్లి.. అతని తప్పులను నేను అడిగినప్పుడు ఒక్కటే మాట అనేవాడు. ఓహో.. నీకు పీరియడ్స్ టైమ్ ఆ.. ఇంకా రాలేదా.. మూడ్ స్వింగ్స్ కదా అంటూ చులకనగా మాట్లాడేవాడు.

అలాంటి మాటలతో నాపై నాకే అసహ్యం వేసింది. ఒకప్పుడు నాకు 11 మంది పిల్లలు ఉండాలని కలలు కనేదాన్ని. కానీ అతని వల్ల, అతని బిహేవియర్ వల్ల ఇప్పుడు అసలు పిల్లలే వద్దు అనే స్థాయికి వచ్చేశాను. ఒక అమ్మాయిగా పుట్టినందుకే కదా ఇలాంటి మాటలు అనిపించేది అంటూ అనుపమ తన మాజీ లవ్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. 

When Anupama Parameswaran was made ashamed