Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Devi Sri Prasad first look from Yellamma out

హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఫస్ట్ లుక్

Devi Sri Prasad first look from Yellamma out

 

ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రమే విన్నారు. ఇకపై ఆయన్ను నటుడిగాను చూసి తరించాల్సిందే. మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలుగా మారడం తెరకు కొత్తేమి కాదు. అలానే దేవిశ్రీ ప్రసాద్ కూడా వేణు యెల్దండి దర్శకత్వంలో ఎల్లమ్మ చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే. దేవిశ్రీ కి పుట్టిన రోజు శుభాకంక్షాలు తెలుపుతూ ఎల్లమ్మ మేకర్స్ దేవిశ్రీ ఫస్ట్ లుక్ వదిలారు. ఆ పోస్టర్ లో దేవిశ్రీ మేకోవర్ చూసి అందరూ షాకవుతున్నారు. ఎన్నడు కనిపించని లుక్ లో దేవి ఈ ఎల్లమ్మలో కనిపించబోతున్నట్టుగా ఫస్ట్ లుక్ తోనే మేకర్స్ స్పష్టతనిచ్చేసారు.

చేతిలో అమ్మవారి కిరీటాన్ని పట్టుకుని, మీసం లేకుండా పార్షి పాత్రలో చాలా కొత్తగా కనిపించాడు. మరి దేవిశ్రీ మ్యూజిక్ మ్యూజిక్ లవర్స్ కి కొత్తేమీకాదు, ఇక ఆయనలోని నట చాతుర్యాన్ని కొత్తగా చూసేందుకు ఆడియన్స్ సిద్దమవ్వాల్సిందే. 

Yellamma: DSP impresses as Parshi