నచ్చకపోతే వదిలెయ్యండి-అల్లు అర్జున్

Allu Arjun Urges Fans to Avoid TrollsAllu Arjun Urges Fans to Avoid Trolls


ఈమధ్యన స్టార్ హీరోల సినిమాలు విడుదలైన మరుక్షణమే యాంటీ ఫ్యాన్స్ ఆ సినిమాలపై నెగెటివ్ ట్రోల్స్ చేస్తూ సినిమాని కిల్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా భారీ బడ్జెట్ సినిమాలు, ప్రేక్షకులను 100 పెర్సెంట్ సాటిస్ఫాయ్ చెయ్యలేకపోతున్నాయి. యావరేజ్ అయిన  సినిమాని కూడా ట్రోలింగ్ చేస్తూ యాంటీ ఫ్యాన్స్ పైశాచికానందం పొందుతున్నారు.

కొంతమంది స్టార్స్ మధ్యలోనే ఈ ఫ్యాన్ వార్ అనేది నడుస్తుంది. దేవర విడుదలైనప్పుడు, పెద్ది  విడుదలైనప్పుడు, అల్లు అర్జున్ పుష్ప విడుదలైనప్పుడు, ప్రభాస్ రాజసాబ్ రిలీజ్ అయినపుడు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసారు. తాజాగా ఈ ట్రోల్స్ విషయమై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నా ఫ్యాన్స్ కి, యాంటీ ఫ్యాన్స్ కి ఈరోజు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను.. ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి.. అంతే కానీ.. వాళ్ళని ద్వేషించడం, కావాలని ట్రోల్ చేయడం మంచిది కాదు, అలా చేసి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు, నీ వన్ పెర్సెంట్ కూడా ఖర్చు పెట్టొద్దు, నీ దగ్గర 100 రూపాయలుంటే ఇష్టం లేని వస్తువు పై ఎవరైనా ఖర్చు పెడతారా, ప్రతీ మనిషికీ ఒక టైమ్ వస్తుంది.. ఒక రోజు వస్తుంది అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ లో మట్లాడారు.

మరి అల్లు అర్జున్ చెప్పిన ఈ వాల్యుబుల్ మాటలు అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ చెవికెక్కించుకుంటారో, లేదో జస్ట్ వెయిట్ అండ్ సి.

Allu Arjun Meets Fans In Hyderabad