చెన్నై లవ్ స్టోరీ షోస్ పెరుగుతున్నాయ్

Chennai Love Story Shows addedChennai Love Story Shows added

 

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం చెన్నై లవ్ స్టోరీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా మంచి నెంబర్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండోరోజు మరిన్ని కలెక్షన్స్ పెంచుకుంది.

కారణం చెన్నై లవ్ స్టోరీకి షోస్ యాడ్ అవుతూ.. థియేటర్స్ పెంచుతున్నారు, చెన్నై లవ్ స్టోరీ మౌత్ టాక్ తో మూడో రోజు ఆదివారం మరిన్ని షోస్ యాడ్ అవడంతో కలెక్షన్స్ మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మంచి సినిమాలేవి లేకపోవడం, తెలుగులో విజయ్ జన నాయగన్ ప్రభావం లేకపోవడం చెన్నై లవ్ స్టోరీకి కలిసొచ్చింది.

అంతేకాకుండా మేకర్స్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్, సోషల్ మీడియా టాక్ అన్ని కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ హిట్ అయ్యేందుకు దోహదపడుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో చెన్నై లవ్ స్టోరీ చాలావరకు బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Chennai Love Story collections