మూడు వారాల డీల్ షాకింగ్ ఏమి కాదు
Nagabandham OTT release
ఈమధ్యన ఓటీటీ డీల్స్ పెద్దగా షాకింగ్ గా ఏమి అనిపించడం లేదు. మంచి సినిమాలు, ప్రేక్షకులు థియేటర్స్ లో మెచ్చిన సినిమాలు మూడు నుంచి నాలుగు వారాలకే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. మా ఇంటి బంగారం రూ.100 కోట్ల పోస్టర్ వదిలిన తెల్లారే నాలుగు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసేసారు.
ఇప్పుడు థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన ఈ చిత్రం మూడు వారాల్లోనే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ పీరియాడిక్ అడ్వెంచర్ చిత్రం నాగ బంధం థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. థియేటర్స్ లో విడుదలైన కేవలం మూడు వారాలకే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
నాగబంధం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సడన్ గా ఈరోజు నుంచే ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హిందీ మినహా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.








































