ప్రఖ్యాత సోనీ పిక్చర్స్ చేతిలో రామాయణం
Ramayana Trailer Postponedనితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవాటెడ్ చిత్రం `రామాయణం` ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్ర అంతర్జాతీయ పంపిణీ బాధ్యతలను ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.
అలాగే ఓ చేదు వార్త కూడా చెప్పారు. `రామాయణం` ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గ్లోబల్ స్థాయిలో సినిమాను మరింత గ్రాండ్‌గా ప్రమోట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి అప్ డేట్ అందిస్తామన్నారు. వాస్తవానికి ట్రైలర్ ను శాన్ డియేగో కామిక్-కాన్ వేదికగా చిత్ర బృందం ప్రత్యేక ప్రెజెంటేషన్ పూర్తి చేసుకున్న తర్వాత జూలై 24న ఉదయం (భారత కాలమానం ప్రకారం సుమారు ఉదయం 8:00 నుండి 10:00 గంటల మధ్య) డిజిటల్ వేదికలలో ఈ ట్రైలర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు.
కానీ సోనీ సంస్థ రైట్స్ దక్కించుకోవడంతో సీన్ మారింది. దీంతో ట్రైలర్ విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గారు. సోనీ ఎంట్రీతో సినిమాకు భారీ పబ్లిసిటీ దక్కుతోంది. అలాగే సినిమా భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగానూ రిలీజ్ అవుతుంది.
భారతీయ సంస్కృతి, ఇతిహాసాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు హాలీవుడ్ రేంజ్ చిత్రంగా అందించా లనేదే ప్రధాన లక్ష్యమని మేకర్స్ తెలిపారు. వంద సంవత్సరాల పైబడిన భారతీయ సినిమా చరిత్రలో ఈ స్థాయిలో గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ దక్కడం మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశమని పేర్కొన్నారు.








































