స్పెషల్ షోస్ కి ఈ టీవీ గుడ్ బై

ETV Special ShowsETV Special Shows

 

ఎన్నో ఏళ్లుగా ఈటీవి లో నైట్ తొమ్మిదిన్నరకు అంటే 9 గంటల ఈటీవి న్యూస్ ముగిసాక ప్రసారమయ్యే క్రేజీ స్పెషల్ ప్రోగ్రామ్స్ కి ఈటీవి గుడ్ బై చెప్పేసింది. సోమవారం పాడుతా తీయగా, మంగళవారం జీన్స్ షో, బుధవారం ఢీ డాన్స్ షో, గురు, శుక్ర వారాల్లో జబర్దస్త్ ప్రోగ్రామ్స్ అంటూ ఎన్నో ఏళ్లుగా స్పెషల్ ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేసింది.

కొన్నాళ్లుగా సోమవారం, మంగళవారం పాడుతా తీయగా, బుధ, గురువారాల్లో ఢీ డాన్స్ షో, శుక్ర, శనివారాల్లో జబర్దస్త్ షో ప్రసారం చేసేవారు. మొట్టమొదటి కామెడీ షో ని ఈటీవీలో లాంచ్ చేసి సూపర్ సక్సెస్ అయ్యింది. ఇకపై ఈ 9.30 కి ప్రసారమయ్యే స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్ని ఈటీవి ఆపేసింది.

ఆ టైమ్ లో అంటే రాత్రి 9.30 నిమిషాలకు ఓ సీరియల్, 10 గంటలకు మరో సీరియల్ ని ఈటీవి స్టార్ట్ చేసింది. మిగతా ఛానల్స్ అన్ని సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు సీరియల్స్ వేస్తున్నాయి. ఇప్పుడు ఈటివి కూడా వాటి సరసన చేరిపోయింది. 

ETV Serial