Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pooja Hegde and Allu Arjun all set to join hands for the third time

బ‌న్నీతో ఛాన్స్ పూజాహెగ్డేకి అంత ఈజీనా?

Pooja Hegde and Allu Arjun all set to join hands for the third time

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ  చిత్రానికి సంబంధించి వ‌స్తోన్న‌ అప్‌డేట్స్ సినిమాపై క్యూరియాసిటీని అంత‌కంత‌కు పెంచుతున్నాయి. లోకేష్ ప్లాప్ ల్లో ఉన్నా? అత‌డి మాస్ ట్రీట్ మెంట్ తో ప్లాప్ ఇంపాక్ట్ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేదు. దీనికి తోడు బ‌న్నీ ఇమేజ్..విజయాల‌తో ఈ కాంబినేష‌న్ ను పీక్స్ తీసుకెళ్తుంది.

తాజాగా  ఈ చిత్రంలో కథానాయిక ఎంపికకు సంబంధించి ఓ  ఆసక్తికర వార్త ఫిల్మ్‌నగర్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. గతంలో అల్లు అర్జున్ సరసన `అల వైకుంఠపురములో` నటించి అలరించిన  పూజా హెగ్డే ను మరోసారి
బ‌న్నీకి జోడీగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప‌రిశీల‌న పూర్తిగా ద‌ర్శ‌కుడి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతుంద‌ని స‌మాచారం. లోక‌ష్ తో పూజాహెగ్డేకు ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా ఆమె పేరును పరిశీలిస్తున్నారుట‌.

దీంతో విష‌యం తెలుసుకున్న పూజాహెగ్డే కూడా త‌న‌నే ఎంపిక చేయాల‌ని ప‌ట్టుబ‌డుతుందిట‌. అయితే అదంత సుల‌భం కాదు. కొంత కాలంగా పూజాహెగ్డే  టాలీవుడ్ అవ‌కాశాలు ఇవ్వ‌ని సంగ‌తి తెలిసిందే. కొన్ని ర‌కాల వివాదాల  నేప‌థ్యంలో అమ్మ‌డిని ప‌రిశ్ర‌మ ప‌క్క‌న‌బెట్టింది. ఈ నేప‌థ్యంలో లొకేష్ ఆమెను ఎంపిక చేయాలంటే?  హీరో అనుమ‌తి స‌హా మ‌రికొంత మంది ప‌ర్మిష‌న్ త‌ప్ప‌ని స‌రే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించి లోకేష్ లీడ్ తీసుకుని ముందుకు వ‌స్తేనే సాధ్య‌ప‌డుతుంది. లేదంటే పూజాహెగ్గే ఎంపిక అంత సుల‌భం కాదని అంటున్నారు.  

Pooja Hegde likely to reunite with Allu Arjun for Lokesh Kanagaraj movie