టెక్నీకల్ టీమ్ పై నాగ్ సెటైర్స్
Nagarjuna calls out long delays for Tollywood releases
ఒకసారి రిలీజ్ డేట్ లాక్ చేసి అఫీషియల్ గా ఆర్భాటంగా ప్రకటించిన తర్వాత పదే పదే ఆ రిలీజ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ పోతున్నారు. ఇది ఇప్పటిది కాకపోయినా టాలీవుడ్ లో ఈ ఏడాది ఇలా పెద్ద సినిమాలు చాలానే వాయిదాలు పడ్డాయి. పెద్ది దగ్గర నుంచి ప్యారడైజ్, మా ఇంటి బంగారం, లెనిన్ ఇలా చాలా సినిమాలు అనుకున్న తేదికి రాలేక డేట్స్ మార్చుకుంటూ పోయాయి.
బాలీవుడ్ లో కానీ, హాలీవుడ్ కానీ ఎప్పుడో ఏడాది ముందే రిలీజ్ డేట్స్ లాక్ చేసి అనుకున్న తేదికి సినిమాలను బాక్సాఫీసు దగ్గరకు తీసుకొస్తాయి. తాజాగా కింగ్ నాగార్జున అదే చెప్పారు. ప్రస్తుతం హాలీవుడ్ నుంచి వచ్చి బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న ది ఒడిసి ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చి అనుకున్న సమయానికి రిలీజ్ చేసారు.
నేను లెనిన్ జూన్ 26 కి వస్తుంది అని చెప్పాను, కానీ టెక్నీకల్ గా సినిమా ఫినిష్ అవ్వలేదు. రిలీజ్ కు కనీసం రెండు వారాల ముందు సినిమా ఇవ్వండి.. కానీ రెండు వారాలేంటి.. రెండు రోజుల ముందు కూడా సినిమా ఫినిష్ అవ్వడం లేదు. రెండు వారాల ముందు సినిమా ఇస్తే ఏమైనా చెయ్యొచ్చు. నా నిన్నేపెళ్లాడతా, అన్నమయ్య ఇలా నా సినిమాలు రెండు నెలలకు ముందే ఫస్ట్ కాపీ చూసేవాళ్ళం.
కానీ ఇప్పుడు అలా కాదు, వంశీ అంటూ నిర్మాత నాగవంశీ కి కూడా చెబుతూ ఈ టెక్నీకల్ టీమ్ చేసే ఆలస్యాలను నాగార్జున బహిరంగంగానే ఎత్తి చూపించారు.







































