లగ్జరీ కార్ల కేసులో దుల్కర్ విచారణ
Customs to question Dulquer Salmaan again
విదేశాల నుంచి లగ్జరీ కార్ల ను దిగుమతి చేసుకుని వాటిని ఇండియాలో నకిలీ రిజిస్ట్రేషన్ల తో మార్కెటింగ్ చేస్తున్న వారిని జల్లెడ వేసి మరీ పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు. గత ఏడాది సెప్టెంబర్ లో కేరళ వ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు లగ్జరీ కార్ల దిగుమతులపై కన్నెయ్యగా ఆ తనిఖీల్లో హీరో దుల్కర్ పట్టుబడ్డారు.
నకిలీ రిజిస్ట్రేషన్లతో భూటాన్ నుంచి భారత్ లోకి లగ్జరీ కార్లను తీసుకువచ్చిన దుల్కర్ సల్మాన్ పై అధికారులు కేసు నమోదు చేసారు. దుల్కర్ ఆఫీస్, ఇల్లు దగ్గర సోదాలు చేసి కొన్ని లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేసారు. తాజాగా కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ ఆఫీస్ లో దుల్కర్ ను విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
అంతేకాకుండా దుల్కర్ సల్మాన్ వద్ద నకిలీ రిజిస్ట్రేషన్లతో ఇంకా ఇతర వాహనాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నట్లు గా సమాచారం.








































