ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Lawrence clarifies on contesting from Trichy

విజయ్ ఈస్ట్ తిరుచ్చి పై లారెన్స్ ఫుల్ క్లారిటీ

Lawrence clarifies on contesting from TrichyLawrence clarifies on contesting from Trichy


పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కోలీవుడ్ హీరో విజయ్ ఈ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూరు, ఈస్ట్ తిరుచ్చి ఇలా రెండు చోట్ల పోటీ చేసి గెలిచి ఈస్ట్ తిరుచ్చి స్థానానికి రాజీనామా చేసారు. దానితో ఆ స్థానంలో మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.

ఆ స్థానానికి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా త్రిష ఈస్ట్ తిరుచ్చి నుంచి గెలిచి విజయ్ ప్రభుత్వంలో కీలక స్థానంలో కొనసాగుతుంది అన్నారు, ఆతర్వాత హీరో రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని, ఆయన్ని విజయ్ డిప్యూటీ సీఎం గా నియమిస్తారని అన్నారు. ఆ విషయమై లారెన్స్ క్లారిటీ ఇచ్చేసారు.

విజయ్ వదులుకున్న తిరుచ్చిలో పోటీ చేయాలంటే దానికి ఒక అర్హత ఉండాలని.. అందుకు తాను తగిన వాడిని కాదు అనుకుంటున్నాను అంటూ ఓ వీడియో షేర్ చేసారు. ఒకరు ఒక మొక్కను నాటి, దానికి నీళ్లు పోసి, ఎరువు వేసి, కాపలా కాసి చెట్టును పెంచితే.. అందులోని పళ్లను తాను కోసుకుని ఎలా తింటాను,

విజయ్ కి బాగా కావాల్సిన వాళ్ళు, పార్టీ కోసం త్యాగాలు చేసైనా వాళ్ళు చాలామంది టీవీకే పార్టీలో ఉన్నారు. కానీ నేను వచ్చి ఆ స్తానం లో పోటీ చేస్తే బాగోదు, తిరుచ్చి నుంచి ఎవరు పోటీ చెయ్యాలో విజయ్ నిర్ణయిస్తారు, ఆయన నిర్ణయాన్ని అందరూ గౌరవించాలంటూ లారెన్స్ ఆ వీడియో లో చెప్పుకొచ్చారు. 

Lawrence on contesting from Trichy