చిరు కాస్త చొరవ చూపండి

Vishwambhara release date updateVishwambhara release date update


విశ్వంభర విడుదల విషయంలో మెగాస్టార్ చిరు గారు కాస్త చొరవ చూపండి అంటూ మెగా ఫ్యాన్స్ చిరు కి రిక్వెస్ట్ లు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. దర్శకుడు వసిష్ఠ సీజీ వర్క్ అంటూ కాలయాపన చేస్తూ విశ్వంభర విడుదలను గాలికొదిలేశారు అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

చిరు కూడా విశ్వంభర విషయం వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారు. స్టార్ హీరో, విడుదల విషయంలో జరుగుతున్న జాప్యం సినిమా పై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అనే మెగా అభిమానుల బాధ. విశ్వంభర నుంచి అప్ డేట్స్ వచ్చి ఏడాది పైనే అవడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తుంది.

వసిష్ఠ ఎంత చెక్కినా సినిమా విడుదలకు ఇంత టైమ్ పట్టదు. మరెందుకీ జాప్యం. కనీసం చిరు బర్త్ డే రోజుకైనా విశ్వంభర విషయం తేలుస్తారో, లేదో తెలియక మెగా అభిమానులు మధనపడిపోతున్నారు.

Vishwambhara update