దిల్ రాజు చెప్పిన హీరో లెక్కలు
Dil Raju revealed that in big-budget films
భారీ బడ్జెట్ సినిమాలైనా, చిన్న సినిమాలైనా ఏ సినిమా అయినా ప్లాప్ అయితే ఒక్క నిర్మతకే కాదు డిట్రిబ్యూటర్స్ కూడా భారీగా నష్టపోతున్నారు. ఏళ్ళ తరబడి సినిమాలు సెట్ పై ఉండడం, నటుల పారితోషికాల విషయంలో నిర్మాతలు నలిగిపోతున్నారు. అయినప్పటికి ఎవరూ మాట్లాడరు.
ఓ ఈవెంట్ లో దిల్ రాజు హీరోల బిహేవియర్ పై చేసిన కామెంట్స్ ఎంతగా వైరల్ అయ్యాయో చూసాం. తాజాగా దిల్ రాజు మరోసారి హీరోల లెక్కలపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. సినిమా బడ్జెట్ లు విపరీతంగా పెరిగాయి. రూ.300 కోట్ల సినిమా వస్తుంటే, అందులో రూ.120 కోట్లు కేవలం హీరో పారితోషికానికే వెళ్లిపోతోంది.
క్రేజీ కాంబినేషన్స్, క్రేజీ ప్రాజెక్టు అని కొనుక్కుంటే డిస్ట్రిబ్యూటర్ కి లాస్. థర్డ్ పార్టీ, హయర్స్ రూపంలో వేస్తే ఎగ్జిబిటర్ కు లాస్. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్.. ఇండస్ట్రీలో నష్టాలు పంచుకుంటోంది ఈ ముగ్గురే అంటూ దిల్ రాజన్ సన్సెషనల్ కామెంట్స్ చేసారు.
ఈ లెక్కలన్ని వేసుకునే హీరోలతో మాట్లాడి, ఒప్పుకున్న వారితోనే సినిమాలు చేస్తున్నాను. కానీ నేను వివరంగా చెప్పినా కొంతమంది హీరోలకు ఆ లెక్కలు అర్ధం కావడం లేదు. నేను సినిమా పోయినా నాకు ఎంత మిగులుతుంది అని చూసుకునే సినిమాలు చేస్తున్నాను అంటూ దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.







































