పెద్ది ఐటమ్ కూడా కుమ్మేసింది
Charan and Rahman fly to Bhopal for 'Peddi' song launch
పెద్ది నుంచి వచ్చిన రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ గా నిలిచాయి. చికిరి చికిరి సాంగ్, రయ్ రయ్ రా.. రా రెండు పాటలు యూత్ కి విపరీతంగా నచ్చేసాయి. రామ్ చరణ్ మాస్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్లామర్ షో, రెహమాన్ మ్యూజిక్, సాంగ్ లిరిక్స్ అన్ని అద్భుతంగా కుదిరాయి.
ఇప్పుడు పెద్ది నుంచి వచ్చిన ఐటమ్ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ కి బాగా ఎక్కేస్తుంది. నిన్న భోపాల్ వేదికగా ఈ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసింది పెద్ది టీమ్ . శృతి హాసన్, జాన్వీ కపూర్ ల నడుమ రామ్ చరణ్ వేసిన స్టెప్స్, రెహమాన్ బ్యూటిఫుల్ మ్యూజిక్, హల్లో.. హల్లో సాంగ్ హిట్ అయ్యేలా చేసాయి. ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నడుమ రామ్ చరణ్ డాన్స్ కి మెగా ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు.
తన గురువు గారు సుకుమార్ ని ఫాలో అవుతూ బుచ్చిబాబు పెద్ది లో ఇలాంటి మాస్ ఐటమ్ పెట్టి ప్రేక్షకులను పడేసాడు అనిపించేలా పెద్ది హల్లో.. హలో సాంగ్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చికిరీ కన్నా హల్లో.. హల్లో మరింత బ్లాక్ బస్టర్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.







































