అఫీషియల్ : బాలయ్య మూవీలో మంచు మనోజ్


గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న NBK 111 చిత్రంలో మంచు హీరో నటిస్తున్నాడనే ప్రచారం నిజమైంది. బాలయ్య-గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లో మంచు మనోజ్ నటిస్తున్నాడు. అదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేసారు.

ఈరోజు మే 20 మంచు మనోజ్ బర్త్ డే. మంచు బర్త్ డే సందర్భంగా NBK 111 టీం బర్త్ డే విషెస్ చెబుతూ.. వదిలిన పోస్టర్ తో మంచు మనోజ్ ఆ చిత్రంలో నటిస్తున్నారనేది అఫీషియల్ అయ్యింది. అది విలన్ రోలా లేదంటే మరేదన్నా కీ రోల్ మంచు మనోజ్ ప్లే చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ గా నయనతారను అనుకుని అనౌన్స్ చేసారు. కానీ తర్వాత నయనతార ప్లేస్ లోకి బాలయ్య సరసన జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వచ్చి చేరింది. 

NBK111 ,Manchu Manoj is on board for NBK111