విభేదాలు లేకుండా విడిపోవడమెందుకు


చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్న కొద్దికాలానికే, అంటే రెండేళ్ళకి, నాలుగేళ్లకు, ఒక్కొక్క జంట 18 ఏళ్లకు, 25 ఏళ్లకు కూడా విడిపోయి అభిమానులకు షాకిస్తారు. వారి మధ్యన విభేదాలు తలెత్తితేనే కదా వారు విడాకులు తీసుకునేది. వారి మద్యన గొడవ లేకుండా విడిపోవడం ఎందుకు.

చాలామంది సెలేబ్రిటీస్ ఇదే చెబుతారు. మేము పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం, మా మధ్యన చర్చలు జరిగాయి, మేము మట్లాడుకుని ఇద్దరి ఇష్టప్రకారమే విడిపోయాము, అంతేకాని మా మధ్యన ఎలాంటి గొడవలు లేవు అంటూ చెబుతుంటారు. గొడవలు లేనప్పుడు విడిపోవడమెందుకో మరి, అదే నెటిజెన్స్ ప్రశ్న.

తాజాగా బాలీవుడ్ నటి మౌని రాయ్ పెళ్లి చేసుకున్న రెండేళ్లకే భర్త తో విడిపోయి విడాకులు తీసుకుంటుంది. అయితే మౌని రాయ్ భర్త నుంచి భారీగా భరణం అందుకుని, భర్తతో సర్దుకోలేని గొడవలు పడింది. మరో నటి కారణంగానే వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఈ ప్రచారం పై మౌని రాయ్ భర్త స్పందిస్తూ.. తమ మద్యన ఎలాంటి విభేదలు లేవు, పరస్పర అంగీకారంతోనే విడిపోయాము, నా నుంచి ఎలాంటి భరణము మౌని రాయ్ కోరలేదు. మేము విడిపోవడానికి కారణం ఓ నటి అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు అన్నారు. మరి వారి మద్యన గొడవలు లేనప్పుడు విడిపోవడం ఎందుకు అనేదే నెటిజెన్స్ ప్రశ్న. 

Divorce ,Divorce That Shook The Internet