హీరో రామ్ స్పెషల్ సర్ ప్రైజ్

ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం డిజప్పాయింట్ చేసిన తర్వాత హీరో రామ్ చాలా పెద్ద బ్రేక్ తీసుకుని తాజాగా తన బర్త్ డే కి కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. ఈరోజు మే 15 హీరో రామ్ బర్త్ డే. బర్త్ డే స్పెషల్ గా కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చెయ్యడమే కాదు.. అభిమానులకి మరో స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
#RAPO23 కి హీరోగానే కాదు.. ఈ చిత్రాన్ని తానే డైరెక్ట్ చేస్తున్నట్టుగా రామ్ చెప్పడం అభిమానులను ఎగ్జైట్ చేసింది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. రామ్ ఈ చిత్రంలో వీర పాత్రలో కనిపించనున్నారు.
#RAPO23 ప్రీ లుక్ పోస్టర్ లో రామ్ లెదర్ జాకెట్ తో కొత్త హెయిర్ స్టయిల్ తో వెనకవైపు నిలబడి ఉన్న లుక్ స్టైలిష్ గా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ పోస్టర్ లో ఒంటరి తోడేలు కథ ఇది అంటూ పెట్టిన ట్యాగ్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
మరి హీరోగానే కాదు తన బర్త్ డే రోజున దర్శకుడిగా మారబోతున్నట్టుగా రామ్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలు పెట్టనున్నట్లుగా సమాచారం.







































