Advertisement

ఓటీటీ లోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2

మార్చ్ 19 న భారీ అంచనాలతో భారీగా విడుదలైన ధురంధర్ సీక్వెల్ ధురంధర్ ద రివెంజ్ నిజంగానే థియేటర్స్ పై రివెంజ్  తీర్చుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 1 చిత్రం అంచనాలు లేకుండా రికార్డ్ లు కొల్లగొట్టగా.. దాని సీక్వెల్ ధురంధర్ ద రివెంజ్ భారీ అంచనాలతో సంచలనాలు నమోదు చేసింది.

థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన ధురంధర్ ద రివెంజ్ రెండు నెలలైనా ఓటీటీ లోకి రాకపోవడంతో ఓటీటీ ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ధురంధర్ పార్ట్ 1 ని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చెయ్యగా.. ధురంధర్ 2 చేతుల మారి జియో హాట్ స్టార్ కి వెళ్ళింది. భారీ డీల్ తో జియో హాట్ స్టార్ ధురంధర్ ద రివెంజ్ ఓటీటీ రైట్స్ దక్కించుకుంది.

కాకపోతే విదేశీ ఓటీటీ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దగ్గరే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ ఈరోజు అంటే మే 15 నుంచి ధురంధర్ ద రివెంజ్ ని స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. ఈ చిత్రం ఇవాళ్టి నుంచి పాన్ ఇండియా భాషల్లో అది కూడా అన్ కట్ వెర్షన్ లో విడుదల కావడం విశేషం. కాకపోతే కేవలం ఓవర్సీస్ ఆడియెన్స్ కి మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

సో ఇండియాలో తప్ప మిగతా దేశాల్లో ఆడియెన్స్ ధురంధర్ 2 ని నెట్ ఫ్లిక్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. మరి తొందరలోనే హాట్ స్టార్ కూడా ధురంధర్ 2 ని స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉంది. 

Dhurandhar 2 OTT ReleaseDhurandhar 2 now streaming on Netflix
Advertisement
Advertisement