పెద్ది ఇక ప్రచారం జోరు

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది.. జూన్ 3 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో హడావిడి మొదలు పెట్టెయ్యనుంది. మే 18 న ముంబై లో పెద్ది ట్రైలర్ లాంచ్ మొదలు జూన్ 2 న హైదెరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు పెద్ది ప్రచార జోరుని మేకర్స్ ప్రకటించారు. ముంబై లో మే 18 న ట్రైలర్ లాంచ్ ఉండబోతుంది.
22 న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఈవెంట్, మే 23 న భోపాల్ లో పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్, 24 బెంగుళూరులో పెద్ది ఈవెంట్, 28 న ఢిల్లీ లో పెద్ది ప్రెస్ మీట్, 30 న చెన్నై లో ఈవెంట్, 1 న విజయనగరంలో పెద్ది ఈవెంట్, జూన్ 2 న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ పెద్ది పవర్ ప్లే టూర్ ని అనౌన్స్ చేసేసారు.
పెద్ది ప్రతి ఈవెంట్ లోను రామ్ చరణ్ ఇంకా జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చి పాల్గొనబోతున్నారని, శివరాజ్ కుమార్, జగపతి బాబు లు కొన్ని ఈవెంట్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది. పాన్ ఇండియా మార్కెట్లో పెద్ది ప్రమోషన్స్ తోనే సినిమాకి హైప్ తెచ్చేలా మేకర్స్ పక్కా ప్లానింగ్ లో ఉన్నారు.







































