వారణాసి కి సమ్మర్ హాలిడేస్ అన్నారు

Varanasi Shooting UpdateVaranasi Shooting Update

 దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న వారణాసి చిత్రం షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ జులై లేదా ఆగష్టు కల్లా ఫినిష్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.

అయితే హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత వారణాసి యూనిట్ లో మహేష్ బాబు, ఇంకా రాజమౌళి ఫ్యామిలీస్ సమ్మర్ హాలిడేస్ తీసుకుని విదేశాల్లో గడిపేందుకు వెళ్ళబోతున్నారని అన్నారు. కానీ ఇప్పుడు వారణాసి షూటింగ్ కి సమ్మర్ హాలిడేస్ లేవు, షూటింగ్ ఆగడం లేదు. జస్ట్ చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ చిత్రీకరణని పరుగులు పెట్టించేందుకు రంగం సిద్ధమైంది.

ఈ షెడ్యూల్ లో రాజమౌళి.. మహేష్ ఇంకా ప్రియాంక చోప్రా లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఒకపక్క షూటింగ్, మరోపక్క ప్రమోషన్స్ ఇలా రాజమౌళి నిత్యం వారణాసి చిత్రాన్ని మీడియాలో ఉంచేలా పక్కా స్కెచ్ తో ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 7 2027 న అనుకున్న సమయానికే వారణాసి విడుదల చేసేందుకు టీమ్ కష్టపడుతుంది. 
 

Mahesh Babu - Varanasi