విజయ్ కి పెరుగుతున్న మద్దతు

Growing support for VijayGrowing support for Vijay

తమిళనాట పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన టీవీకే విజయ్ కు తమిళనాడు గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వకుండా ట్విస్ట్ ల మీది ట్విస్ట్ లు ఇస్తున్నారు. విజయ్ కి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో విజయ్ 108 సీట్లు గెలిచినా ఇంకా పోరాడాల్సి వస్తుంది.

మిగతా 11 సీట్ల కోసం వామపక్షాల మద్దతు కోరినా వారు నిరాకరించడం, కాంగ్రెస్ టీవీకే కు సపోర్ట్ ఇవ్వడం, మధ్యలో డీఎంకే, అన్నడీఎంకే లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే వార్తలు, ఈ నేపథ్యంలో విజయ్ ఈరోజు చెయ్యాల్సిన ప్రమాణ స్వీకారం రద్దవడం, మళ్లీ గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటు కు అవకాశం కోసం సమయం కోరటం అన్ని సినిమాల్లో కనిపించే ట్విస్ట్ లు కన్నా ఎక్కువగా ఉన్నాయి.

విజయ్‌ బలనిరూపణ తర్వాతే ప్రమాణస్వీకారం అంటూ గవర్నర్ చెప్పడంతో అటు విజయ్ అభిమానులు, ఇటు నెటిజెన్స్, ఇంకా కమల్ లాంటి సెలెబ్రిటీస్ విజయ్ కి మద్దతుగా గవర్నర్ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కు అవకాశం ఇవ్వాలని మాట్లాడుతున్నారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే ప్రభంజనం సృష్టించిన విజయ్ కు గవర్నర్ అవకాశం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అవకాశం ఇవ్వాలంటూ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ విజయ్ కు సపోర్ట్ గా మాట్లాడారు.

మరి విజయ్ అటు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. 

TVK Vijay