ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> R Narayana Murthy fired on Telugu heroes

హీరోల తీరు తెన్నుల‌పై నారాయ‌ణ‌మూర్తి ఆవేద‌న‌

R Narayana Murthy fired on Telugu heroesR Narayana Murthy fired on Telugu heroes

ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ తీరుతెన్నులపై తనదైన శైలిలో స్పందించారు. ఆయన ప్రసంగంలో తీవ్ర‌మైన ఆవేద‌న క‌నిపించింది.

``సినిమా ఇండస్ట్రీ అంటే నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా ఉండాలి. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఏడాదికి ఎన్ని సినిమాలు చేసేవారో మనందరికీ తెలుసు. ఆయనలాగా ఎక్కువ సినిమాలు వస్తేనే ఇండస్ట్రీలో అందరికీ పని దొరుకుతుంది.. పరిశ్రమ కళకళలాడుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?`` అంటూ నారాయ‌ణ‌మూర్తి ప్ర‌శ్నించారు.

మనం ఆస్కార్ స్థాయికి వెళ్ళాం.. అది చాలా సంతోషించాల్సిన విషయం. కానీ మరోవైపు చూస్తే అథఃపాతాళానికి పడిపోతున్నాం. ముఖ్యంగా ఈ ఎండాకాలం సీజన్‌ను గమనించండి. సాధారణంగా వేసవి సెలవుల్లో పెద్ద సినిమాలు క్యూ కడతాయి. కానీ ఇప్పుడు ఒక్క భారీ సినిమా అయినా ఉందా? అసలు ఏమైపోయాయి ఆ సినిమాలు? ఇలాంటి పరిస్థితి వస్తే ఇండస్ట్రీని నమ్ముకున్న కార్మికుల గతేంటి? అని ఆయన ప్రశ్నించారు.

పెద్ద సినిమాలు ఏడాది పొడవునా పంపిణీ కాకుండా.. కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం కావడం వల్ల చిన్న సినిమాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మా గురువుగారు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఎక్కువ సినిమాలు తీసేవారు. సూప‌ర్ స్టార్ కృష్ణ ఎక్కువ సినిమాల్లో న‌టించేవారు.. మ‌న హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. అప్పుడే ఇండ‌స్ట్రీ ప‌చ్చ‌గా క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని నారాయ‌ణ‌మూర్తి అన్నారు.

ఏడాదంతా సినిమాలు తీస్తూ కార్మిక శ‌క్తికి నిరంత‌రం ఉపాధి అందించాల్సిన బాధ్య‌త ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌పై ఉంద‌నేది ఆయ‌న ఆవేద‌న సారంశం. స్టార్ హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ విష‌యంపై సీరియ‌స్ గా ఆలోచించాల్సి ఉంది.
 

R Narayana Murthy