సూపర్ స్టార్ అభిమానులను కెలికారు

Superstar fans fires on VijaySuperstar fans fires on Vijay

అవును హీరో విజయ్ పార్టీ TVK నేతలు అనవసరంగా సూపర్ స్టార్ రజినికాంత్ అభిమానులతో గొడవ పెట్టుకున్నారు. అందరితో సఖ్యతతో ఉంటూ రాజకీయాల్లో ఎదగాల్సిన విజయ్ కి ఇది మాములు దెబ్బ కాదు. కోలీవుడ్ సూపర్ స్టార్స్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఆయన్ని ఏమైనా అంటే వాళ్ళు అస్సలు ఊరుకోరు కదా..

విజయ్ TVK పార్టీ నేత అధవ్ రజినీకాంత్ DMK పార్టీ బెదిరింపులకు భయపడి రాజకీయాల్లోకి రాలేదు, కానీ విజయ్ అలాంటి సమస్యలు తట్టుకుని, దాటుకుని రాజకీయాల్లోకి వచ్చారు.. అంటూ చేసిన కామెంట్స్ పై ఇప్పటికే రజినీకాంత్ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ విజయ్ పై ఆయన పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు.

అధవ్ వెంటనే సూపర్ స్టార్ కి సారీ చెప్పాలని సూపర్ స్టార్ అభిమానులు డిమాండ్ చెయ్యడమే కాదు.. ఇప్పుడు వీరి ఆగ్రహం వల్ల విజయ్ కి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఉండి ఉండి ఎలక్షన్స్ ముందు విజయ్ పార్టీ నేతలకు ఎందుకింత నోటి దురద అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు 

Rajinikanth fans fires on Vijay Party

rajinikanth