బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో రిలీజ్ అవుతోన్న `ధురంధర్ 2` విడుదలకు ముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనంగా మారుతుంది. ఈ సినిమాపై నెలకొన్న అసాధారణ క్రేజ్ చూస్తుంటే? బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ చిత్ర ప్రభంజనం ఎంతలా ఉందంటే? ముంబైలోని ఐకానిక్ థియేటర్ మరాఠా మందిర్‌లో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ డీడీఎల్‌జే` షో సమయాన్ని కూడా మార్చాల్సి రావాల్సినంతగా కనిపిస్తోంది.
దాదాపు 3 గంటల 55 నిమిషాల భారీ నిడివితో రిలీజ్ అవుతున్న `ధురంధర్ 2` కోసం థియేటర్ల యాజమాన్యాలు షోల సర్దుబాటులో తలమునకలయ్యాయి. మరాఠా మందిర్‌లో గత 30 ఏళ్లుగా ఉదయం 11.30 గంటలకు ప్రదర్శితమవుతున్న `దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే` షోను ఇప్పుడు ఉదయం 10 గంటలకే మార్చారు. ఒక హిందీ సినిమా కోసం దశాబ్దాల చరిత్ర కలిగిన డీడీఎల్‌జే సమయం మారడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి అర్ధరాత్రి, తెల్లవారుజామున కూడా ప్రత్యేక షోలను ప్లాన్ చేస్తుండటం సినిమాపై ఉన్న హైప్‌కు నిదర్శనం.
బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే `ధురంధర్ 2` అప్పుడే ఆల్-టైమ్ రికార్డులపై కన్నేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే 30.31 కోట్లు రాబట్టింది. తొలిరోజు వసూళ్లలో షారుఖ్ ఖాన్ `జవాన్` రికార్డును అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. `జవాన్` హిందీలో సాధించిన రూ. 65.50 కోట్ల రికార్డును దాటాలంటే ఈ సినిమాకు మరో రూ. 35 కోట్ల వసూళ్లు అవసరం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఆ మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అసలైన సవాలు అల్లు అర్జున్ `పుష్ప 2` సృష్టించిన రికార్డులతోనే మొదలవ్వనుంది. హిందీ వెర్షన్‌లో తొలిరోజే రూ. 72 కోట్లు సాధించిన `పుష్ప 2` రికార్డును `ధురంధర్ 2` తిరగరాస్తుందా ? లేదా? అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.





బాలీవుడ్‌కు నియంత్రణ విధించాల్సిందే!

Loading..