Advertisementt

దేశ‌భ‌క్తి క‌థను వ‌క్రీక‌రించిన స్టార్

Tue 17th Mar 2026 10:02 AM
salman khan  దేశ‌భ‌క్తి క‌థను వ‌క్రీక‌రించిన స్టార్
Salman Khan దేశ‌భ‌క్తి క‌థను వ‌క్రీక‌రించిన స్టార్
Advertisement
Ads by CJ

ట్రంప్ కొట్టిన దెబ్బ‌కు సినిమా క‌థ‌లే మారుతున్నాయి! ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ త‌న సినిమా క‌థ మార్చి ఏకంగా రీషూట్ల కోసం కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్లు కేటాయించాల్సి వ‌చ్చింది. ఇదంతా ది బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ గురించే.. నిజానికి గ‌ల్వాన్ లోయ‌లో జ‌రిగిన ఇండియా- చైనా సేన‌ల బాహాబాహీ వార్ నేప‌థ్యంలో సినిమా తీయాల్సింది..

కానీ చైనాతో భార‌త్ స‌త్సంబంధాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలో మొత్తం ఆలోచ‌న మారింది. స‌ల్మాన్ పై భార‌త ప్ర‌భుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది. ఇరు దేశాల మ‌ధ్య‌ దౌత్య సంబంధాలు దెబ్బ తిన‌కుండా స‌ల్మాన్ త‌న స్క్రిప్టును అమాంతం మార్చుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌పంచ దేశాల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దూకుడు నేప‌థ్యంలో చైనాతో అనూహ్యంగా భార‌త్ స్నేహం చేయ‌డం తెలిసిందే.

దీనివ‌ల్ల ముందే తెర‌కెక్కించిన కొన్ని సీన్ల‌ను కూడా తిరిగి రీషూట్లు చేయాల్సి వ‌చ్చింది. దానికోసం అద‌న‌పు బ‌డ్జెట్ పెరిగింది. ఇక ఇప్పుడు తెర‌కెక్కిస్తున్న‌ది పూర్తిగా ఫిక్ష‌న్ సినిమా. అందువ‌ల్ల బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ టైటిల్ ని కూడా మార్చేయాల్సి వ‌చ్చింది. మాతృభూమి అని టైటిల్ పెట్టారు. కొత్త వెర్ష‌న్ లో వార్ నేప‌థ్యం కంటే కూడా ఇందులో సైనికుడి హృద్య‌మైన ప్రేమ‌క‌థ‌ను తెర‌పై చూపిస్తున్నార‌ట‌. అంటే దీని అర్థం మొత్తం క‌థ రూపం మార్చుకుంది. ఇందులో వాస్త‌విక‌త కూడా రూపు మాసిపోయింద‌ని తెలుస్తోంది. పూర్తిగా క‌థ‌ను ఫిక్ష‌న‌లైజ్ చేసి తెర‌కెక్కిస్తున్నారు.

తాజా స‌మాచారాన్ని బ‌ట్టి ఇది `యూరి` త‌ర‌హాలో రియ‌లిస్టిక్ క‌థ‌తో రూపొంద‌డం లేదు. అందువ‌ల్ల ప్ర‌జ‌ల్లో దేశ‌భ‌క్తి భావ‌జాలాన్ని ర‌గిలించేందుకు కూడా ఆస్కారం లేదు. ఇది ఫిక్ష‌న్ క‌థ‌తో అని ముందే బాలీవుడ్ మీడియాలు వెల్ల‌డిస్తున్నాయి గ‌నుక‌... ఇప్పుడు ఈ సినిమాపై క్యూరియాసిటీ కూడా త‌గ్గిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మాతృభూమి చిత్రానికి అపూర్వ ల‌ఖియా ద‌ర్శ‌కుడు. ఇందులో సల్మాన్ స‌ర‌స‌న చిత్రాంగ‌ద సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తొలిసారిగా ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషించబోతున్నాడు.

స్క్రిప్టును తిర‌గ‌రాసారు. కొత్త వెర్షన్ లో సల్మాన్ ఖాన్ -చిత్రాంగద పాత్రల మధ్య మరింత సన్నిహిత ప్రేమ‌క‌థ‌ను రంగ‌రించారు. ఇప్పుడు ప్రేమ‌క‌థ కేంద్రంగా అనేక విధాలుగా సంఘర్షణల మధ్య ప్రేమను సమతుల్యం చేసుకునే ఒక సైనిక అధికారి కథగా మారింది. ఇది నిజమైన ప్రేమ & యుద్ధం! అని ప్ర‌చారం మొద‌లు పెడుతున్నార‌ట‌.

ఈ చిత్రం ఇప్పుడు జూలై నుండి అక్టోబర్ రిలీజ్ కి షిఫ్ట‌యింది. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి కొత్త వెర్షన్‌కు అనుమతులను బట్టి ఉంటుంది. చాలా భాగం షూటింగ్ పూర్తి అయినా కానీ.. వేసవిలో కొంత ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తార‌ని స‌మాచారం.

Salman Khan:

Salman Khan Battle of Galwan

Tags:   SALMAN KHAN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ