Advertisement

సముద్రఖని - క్రాక్ కి మించి NBK 111

రవితేజ-గోపీచంద్ మలినేని కలయికలో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సూపర్ హిట్ క్రాక్ చిత్రంలో కటారి కృష్ణ గా విలన్ రోల్ లో భయపెట్టిన సముద్రఖని ఇప్పుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న నందమూరి బాలకృష్ణ NBK 111 చిత్రంలోనూ క్రాక్ కి మించి పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో రివీల్ చేసారు.

సముద్రఖని విలక్షణ నటుడు. మరి గోపీచంద్ మలినేని-బాలకృష్ణ ల NBK 111 చిత్రంలో ఆయన విలన్ రోల్ పోషిస్తున్నారేమో అంటూ సముద్రఖని కామెంట్స్ చూసాక నందమూరి అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. రీసెంట్ గా మొదలైన NBK 111 షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

అక్కడ గోపీచంద్ మలినేని జేసీబీ ఫైట్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. బాలయ్య కూడా సైలెంట్ గా NBK111 సెట్ లో బిజీగా వున్నారు. ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపంచబోతున్నారనే వార్త ఎప్పటినుంచో చక్కర్లు కొడుతోంది. 

Samuthirakani Joins Balakrishna-Gopichand Malineni Film

Samuthirakani Joins NBK111
samuthirakani