ఆస్కార్ 2026లో అవతార్ 3కి VFX అవార్డ్
అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ పురస్కారం దక్కింది.. అయితే ఈసారి అవతార్3 ఈ ఒక్క విభాగంలోనే పురస్కారం గెలుచుకుంది. ఐదేళ్ల క్రితం విడుదలైన `అవతార్ 2` చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనే ఆస్కార్ పురస్కారం దక్కింది. 2009లో వచ్చిన అవతార్ మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ సహా మరో రెండు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది.
అవతార్ మొదటి చిత్రానికి మల్టిపుల్ ఆస్కార్ అవార్డులు వచ్చినా అవతార్ 2, అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) చిత్రాలు మాత్రం కేవలం బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ పురస్కారాన్ని మాత్రమే దక్కించుకున్నాయి.
ఆస్కార్స్ 2026లో సిన్నర్స్ చిత్రం ఒరిజినల్ స్కోర్ సహా ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డుతో మెరుపులు మెరిపించింది. అవతార్ చిత్రం కలెక్షన్లు తగ్గుతున్న క్రమంలో దీనిని రీవ్యాంప్ చేస్తూ అవతార్ 4 కోసం ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలని, చాలా ఏళ్ల క్రితం అవతార్ లు ఎలా ఉండేవారో కథలో చూపించబోతున్నారని కూడా తెలుస్తోంది. ఫైర్ అండ్ యాష్ కలెక్షన్ల పరంగా నిరావపరిచినా నాలుగో భాగాన్ని మాత్రం తగ్గేదేలే అనే రీతిలో కామెరూన్ తెరకెక్కిస్తున్నారు.
Best VFX Award for Avatar 3 at Oscars 2026
Best VFX Award for Avatar 3








































