Advertisement

భార్య‌, కుమారుడు కోసం స్పెష‌ల్ గిప్ట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ షూటింగ్  షెడ్యూల్స్ తో ఎంత బిజీగా ఉన్నా? కుటుంబాన్ని ఏమాత్రం విస్మరించకుండా  ప్రేమను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న కొరియన్ కన‌క‌రాజు షూటింగ్ దక్షిణ కొరియాలో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే  వ‌రుణ్  అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు తన భార్య లావణ్య త్రిపాఠితో పాటు తన ముద్దుల కుమారుడి కోసం కూడా ప్రత్యేకమైన బహుమతులను సిద్దం చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ వార్త మెగా అభిమానుల్లో ఎంతో ఆస‌క్తిక‌రంగా మారింది.

కొరియాలో దొరికే అత్యంత అరుదైన డిజైనర్ వస్తువులు మరియు ట్రెండీ ఫ్యాషన్ ఎక్సెసరీస్‌ను తన భార్య లావణ్య కోసం వరుణ్ ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే తన కుమారుడి కోసం అక్కడి ప్రత్యేకమైన ఆటబొమ్మలు , కొరియన్ కల్చర్‌కు సంబంధించిన స్పెషల్ కిడ్స్ వేర్‌ను  సేకరించారట. షూటింగ్ గ్యాప్‌లో వరుణ్ స్వయంగా మార్కెట్లకు వెళ్లి ఈ కానుకలను కొనుగోలు చేయడం ఆయనకు తన కుటుంబంపై ఉన్న అమితమైన అనురాగానికి నిదర్శనంగా చెప్పొచ్చు.

మెగా ఫ్యామిలీలో వరుణ్-లావణ్య దంపతుల చిన్నారి గురించిన విశేషాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటున్నాయి. తండ్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే వృత్తిపరంగా కూడా విదేశాల్లో కష్టపడుతున్న వరుణ్, తిరిగి వచ్చేటప్పుడు తెచ్చే ఈ గిఫ్ట్‌లు ఆ చిన్నారికి -లావణ్యకు ఒక మధురమైన సర్ప్రైజ్‌గా మారనున్నాయి. కొరియన్ కనకరాజు షూటింగ్ ముగించుకుని వరుణ్ ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటారా? అని మెగా కుటుంబం ఆశగా ఎదురు చూస్తోంది.

Hero Varun Tej and his Son

Varun Tej
varun tej