విజయ్ దారిలో నడవనున్న త్రిష

Trisha following VijayTrisha following Vijay

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయకన్ రిలీజ్ ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈలోపే విజయ్ తో త్రిష డేటింగ్ చేస్తుంది అనే వార్తల నడుమ విజయ్ కి ఆయన భార్య సంగీత విడాకులు ఇవ్వడానికి సిద్దపడి కోర్టులో కేసు వేసింది.

అయితే సంగీత విడాకుల కేసు ఫైల్ చేసిన వెంటనే విజయ్ తో త్రిష కలిసి ఓ పెళ్ళికి అటెండ్ అవడం తో విజయ్-త్రిష రిలేషన్ నిజమే అనుకున్నారు. తాజాగా త్రిష ను ఎయిర్ పోర్ట్ లో విజయ్ తో కలిసి పెళ్ళికి వెళ్లారు అని మీడియా ప్రశ్నిస్తే త్రిష ఆన్సర్ చెప్పకుండా తప్పించుకుంది. 

ఇక త్రిష కూడా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి విజయ్ తో పాటుగా నడవాలని అనుకుంటుందట. విజయ్ తో పాటుగా అంటే భార్య గా కాదు, అయన పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయాల్లోకి దిగాలని చూస్తుందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ నుంచి త్రిష పోటీ చెయ్యాలని అనుకుంటున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Trisha Considering Politics, To Join TVK

trisha